CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 12:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు

  • 10 మందిపై కేసులు నమోదు.. 48 లీటర్ల నాటుసారా స్వాధీనం.. 1,200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

మహబూబాబాద్, జూలై 22(చైతన్యగళం): వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కే. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, డీటీఎఫ్ మహబూబాబాద్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా చేపట్టిన ఈ దాడుల్లో 10 మందిపై కేసులు నమోదు చేసి, 48 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 1,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

గతంలో రెండుసార్లు సారాయి విక్రయిస్తూ పట్టుబడి, తాజాగా మరోసారి సారాయి తయారు చేస్తూ పట్టుబడిన జరుపుల బావు సింగ్‌ను అరెస్టు చేసి మహబూబాబాద్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు.

కేసులు నమోదైన వారి వివరాలు: జరుపుల బావు సింగ్, బానోతు వీరమ్మ, సపావత్ సురేష్, గుగులోతు దేవ్‌జీ, బోడ బుజ్జి, గుగులోతు రాములు, గుగులోతు బాల, జాటోతు సత్యవతి, బానోతు ఉపేందర్, బోడ తులసి.

ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐలు జి. చిరంజీవి, కే. నాగయ్య, సీహెచ్. నాగేశ్వరరావు, సీహెచ్. నీరజ, జి. చంద్రశేఖర్, ఎక్సైజ్ ఎస్సైలు ఆర్. కిరీటి, జి. మౌనికతో పాటు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, బుచ్చయ్య, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సంపూర్ణ, గోపి, బలరాం, రియాజ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.