వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి-కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం): జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వయోవృద్ధులు తమ పిల్లల నుంచి మెయింటెనెన్స్ కోరుతూ చేసిన దరఖాస్తులను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని, ఆర్డీవో ఉత్తర్వుల మేరకు తల్లిదండ్రులకు ప్రతినెలా మెయింటెనెన్స్ అందుతున్నదీ లేదీ పర్యవేక్షించాలని సూచించారు. మెయింటెనెన్స్...