ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించాలి – రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి, జూలై 21 (చైతన్యగళం): ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు అష్టైశ్వర్యాలతో జీవించాలని సంకల్పంతో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర 91వ విశ్వశాంతి మహాయాగం ఎంతో గొప్పదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో జరుగుతున్న ఆయుత చండీ అతి రుద్ర మహాయాగంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజ సంభ ఆవిష్కరణలో పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ...