ఓటరు జాబితా ప్రత్యేక సవరణను వేగవంతం చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
సిద్దిపేట, జూలై 21 (చైతన్యగళం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి...