రైతు సదస్సుకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
పెద్దపల్లి, జూలై 21 (చైతన్యగళం): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) మంచిర్యాల్ నియోజకవర్గంలోని లక్షేపేటలో నిర్వహించిన రైతు సదస్సుకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. ఆయన మాట్లాడుతూ, “రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ బలంగా వినిపిస్తోంది. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు...