కల్వకుర్తిలో ఆధ్యాత్మిక శోభ – విశ్వశాంతి మహాయాగంలో యాగ ప్రతిష్ట
కల్వకుర్తి, జూలై 21 (చైతన్యగళం): ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించాలని సంకల్పిస్తూ కల్వకుర్తిలో జరుగుతున్న శ్రీకృష్ణ కాలచక్ర 91వ విశ్వశాంతి మహాయాగం రెండవ రోజు ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉదయం శివుని పూజా కార్యక్రమాలు నిర్వహించగా, గోపూజ మహోత్సవం సందర్భంగా గోవులకు పూజలు చేసి యాగశాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. వేదమంత్రాల ఘోషతో యాగశాల ప్రవేశం ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలరించింది. పండితులు వేదపఠనం చేస్తూ హోమాలను ముందుకు నడిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక శోభను ఆస్వాదించారు.ఈ సందర్భంగా...