ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి
కరీంనగర్, జూలై 21 (చైతన్యగళం): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో) రోజుకు...