భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా (బీజేవైఎం) కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా సంగ నరేష్
కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా (బీజేవైఎం) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చొప్పదండి పట్టణానికి చెందిన సంగ నరేష్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగ నరేష్ మాట్లాడుతూ, “జిల్లాలో బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తాను. యువతలో దేశభక్తి, జాతీయతా భావం పెంపొందించేందుకు, సామాజిక సేవలో యువతను భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తాను” అని తెలిపారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ...