CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 9:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా (బీజేవైఎం) కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా సంగ నరేష్

కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం):
భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా (బీజేవైఎం) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చొప్పదండి పట్టణానికి చెందిన సంగ నరేష్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగ నరేష్ మాట్లాడుతూ, “జిల్లాలో బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తాను. యువతలో దేశభక్తి, జాతీయతా భావం పెంపొందించేందుకు, సామాజిక సేవలో యువతను భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తాను” అని తెలిపారు.

తన నియామకానికి సహకరించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునిల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు కుండే గణేష్తో పాటు రాష్ట్ర, జిల్లా పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.