అమ్మనగర వంతెనతో దూరభారం తగ్గుతుందని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ వెల్లడి

నిజామాబాద్, జూలై 21 (చైతన్యగళం‌): నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్ సమీపంలో నిర్మించిన నూతన వంతెనను మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “నూతన వంతెన నిర్మాణంతో నిజామాబాద్ రూరల్–అర్బన్ పట్టణాల మధ్య దూరభారం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా 4వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యాలయాలకు, మార్కెట్‌కు, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే వారికి ఈ వంతెన సౌకర్యాన్ని కల్పిస్తుంది” అని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో...