మిర్యాలగూడను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో SIR కార్యక్రమం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు

మిర్యాలగూడ, జూలై 21 (చైతన్యగళం): మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో SIR కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్ షబ్బీర్ అలీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్‌చార్జ్‌లు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “Special Intensive Revision (SIR) కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే అత్యంత కీలకమైన...