CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:57 am Posted by : CHAITHANYA GALAM NEWS

మిర్యాలగూడను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో SIR కార్యక్రమం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు

మిర్యాలగూడ, జూలై 21 (చైతన్యగళం):
మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో SIR కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్ షబ్బీర్ అలీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్‌చార్జ్‌లు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “Special Intensive Revision (SIR) కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే అత్యంత కీలకమైన ప్రక్రియ. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావాలి. ఎలాంటి తప్పులు లేకుండా జాబితాను రూపొందించడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలి” అని సూచించారు.

ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “SIR కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలి” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు బూత్ స్థాయి నుంచి సమర్థవంతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా SIR కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలో మిర్యాలగూడకు ఆదర్శ స్థానాన్ని తీసుకురావాలని కోరారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్‌చార్జ్‌లు, BLAలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.