కరీంనగర్‌లో అర్ధరాత్రి భారీ దోపిడీ

  వృద్ధ దంపతులను బంధించి బంగారం, నగదు దోచుకెళ్లిన ఎనిమిది మంది దుండగులు 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు అపహరణ.. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు కరీంనగర్, జూలై 22 (చైతన్య గళం): కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న భారీ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. పక్కా ప్రణాళికతో వచ్చిన ఎనిమిది మంది గుర్తుతెలియని దుండగులు ఓ ఇంటిలోకి చొరబడి వృద్ధ దంపతులు హజ్మత్ అలీ, మెహబూబా బేగం దంపతులతో పాటు కుటుంబ సభ్యులను తాడులతో కట్టేసి,...