ఎంపీల అరెస్టులకు నిరసనగా హుస్నాబాద్‌లో మహాధర్నా
హుస్నాబాద్, జూలై 22 (చైతన్య గళం): ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నిరసనకారులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టి, విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత...