CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 12:56 pm Posted by : rakeshkashaveni12@gmail.com

భగత్‌నగర్‌లో భారీ దోపిడీ

కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం):

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఎనిమిది మంది దుండగులు ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులు, కుటుంబ సభ్యులను బెదిరించి కట్టేసి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు. అనంతరం ఇంటి వద్ద ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది