కాలేశ్వరం నీళ్లు ఉమ్మడి జిల్లాకు అందలేదని విమర్శించిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు

పెద్దపల్లి, జూలై 21 (చైతన్య గళం): గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కేవలం మెదక్, గజ్వేల్ ప్రాంతాలకే తరలించిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మల్యాల, తారుపల్లి, మీర్జాంపేట, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల్లో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జిలు, మార్కెట్ భవనం, మహిళా భవనం, సీసీ రోడ్లు,...