అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి,జూలై 22( చైతన్యగళం) : సుల్తానాబాద్ పట్టణంలోని సుగులంపల్లి గ్రామానికి చెందిన చొప్పరి భూమేష్ కుమార్తె కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి* *మనోహర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి వెంట మాజీ కౌన్సిలర్ మమత సంపత,brs నాయకులు ప్రశాంత్, సదయ్య, రాజయ్య,తిరుపతి, లక్ష్మణ్, పాల్గొన్నారు.