ఆషాఢ తొలి మంగళవారం – శాఖంబారి దేవిగా వాసవి మాత దర్శనం

షాద్‌నగర్, జూలై 21 (చైతన్యగళం): ఆషాఢ మాసం తొలి మంగళవారం సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని శాఖంబారి దేవి అవతారంలో అత్యంత వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వాసు పంతులు వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖంబారి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి మాతను దర్శించుకునేందుకు మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి పూలు, పండ్లు, కూరగాయలతో విశేష అలంకరణ చేయడంతో...