మహిళలకు ఆర్థిక అక్షరాస్యత– సైబర్ భద్రతపై అవగాహన
సిద్ధిపేట, జూలై 21 (చైతన్యగళం): స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో సిద్ధిపేటలోని ఆర్‌సేటీ (RSETI)లో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 85 మంది స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపు లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో పొదుపు అలవాటు పెంపొందించాలని, బ్యాంకుల ద్వారా అందుబాటులో...