చైనాలో గోల్డ్ మెడల్ సాధించిన ప్రవళికకు ఉపాధ్యాయుల ఆర్థిక చేయూత

దేవరకొండ, జూలై 21 (నీలగిరి ఎక్స్‌ప్రెస్): చైనాలోని ఓర్డోస్ నగరంలో ఇటీవల నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టులో పాల్గొని స్వర్ణ పతకం సాధించిన నల్గొండ జిల్లా డిండి మండలం గుండ్లపల్లికి చెందిన యువ అథ్లెట్ నారిమళ్ల ప్రవళికకు స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఘన సత్కారం అందించారు.మంగళవారం ఆర్పీఆర్పీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన అభినందన సభలో మండల పరిధిలోని ఉపాధ్యాయులు ప్రవళిక క్రీడా, విద్య అవసరాల కోసం తమ ఉదారతతో ఆర్థిక...