ఎల్‌నినో ప్రభావం ఆరుతడి పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి
హుస్నాబాద్, జూలై 21 (చైతన్యగళం): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) స్వామి సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మహ్మదాపూర్ గ్రామంలో సర్పంచ్ జిల్లెల తిరుమల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ స్వామి మాట్లాడుతూ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న,...