పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మహబూబాబాద్, జూలై 22(చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా సైన్స్ అధికారి, గణిత శిక్షణ కోర్సు ఇన్‌చార్జి అప్పారావు అన్నారు. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు రోజుల గణిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. శిక్షణలో రిసోర్స్ పర్సన్ రాయిపెల్లి యాకయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపాధ్యాయులను కోరారు. దీనికి స్పందించిన జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన గణిత ఉపాధ్యాయులు తమ...