ఎల్ నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణే రక్షణ

ప్రజా భవన్‌లో రాష్ట్ర నిపుణుల కమిటీ సమావేశం తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ తరఫున కె.వి.ఎన్. రెడ్డి కీలక సూచనలు హైదరాబాద్, జూలై 22 (చైతన్యగళం): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, శాస్త్రీయ విధానాల అమలే కీలకమని తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ ప్రతినిధి కె.వి.ఎన్. రెడ్డి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిస్థితులకు అనుగుణంగా కంటింజెన్సీ కార్యాచరణ ప్రణాళికలను...