రాహుల్ అరెస్టుపై భగ్గుమన్న కాంగ్రెస్
ఆమనగల్లులో రాస్తారోకో.. మోదీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం పోలీసులతో తోపులాట ఆమనగల్లు, జూలై 22 (చైతన్యగళం): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వారి శివలింగంతో కలిసి భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ అరెస్టును...