శాతవాహనలో కంప్యూటర్ సైన్స్ వర్క్‌షాప్

కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం): శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో కోడ్‌క్రాఫ్ట్–పైథాన్ అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. రమాకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, కోడింగ్ ఆధారిత అప్లికేషన్లకు ఉన్న డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొత్త అవకాశాలను వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ విద్యార్థులు కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకొని ఉత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రిసోర్స్ పర్సన్‌గా డా. బి. రమా రెడ్డి...