కస్తూర్బా పాఠశాలలో రాత్రి భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సిద్దిపేట, జూలై 21 (చైతన్యగళం): తొగుట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న రాత్రి భోజనం, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నం, వంకాయ–టమాట పచ్చడి, సాంబారు, పెరుగుతో కూడిన భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని వంట సిబ్బందికి సూచించారు. స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరుకు అనుగుణంగా సరుకులను కొలతల ప్రకారం పంపిణీ...