CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 5:14 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఇబ్రహీంపట్నం,జూలై 22 (చైతన్యగళం) : నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్‌ కోసం నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్షను విరిమింపచేసేలాగా ప్రభుత్వ చర్యలు ఉండాలని ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.
నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ దాడి నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాస్తారోకో, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, నీట్ వివాదంపై కేంద్రమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అవమానమని విమర్శించారు. నీట్ పరీక్ష అక్రమాలపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు బాలశివుడు గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, మున్సిపల్ కౌన్సిలర్లు నీళ్ల భాను గౌడ్, దారు రాఘవేంద్రరావు, ఎన్ ఎస్ యు ఐ నియోజవర్గ అధ్యక్షులు నందకిషోర్, అయాన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.