CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 4:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు మీసాల వర్షిత్

ఆమనగల్లు, జూన్ 22 (చైతన్య గళం): ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని బీఆర్ఎస్వీ నాయకుడు మీసాల వర్షిత్ (చిక్కి) తీవ్రంగా ఖండించారు.

ఆయన మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులకు తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తపరచే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటి పరిస్థితుల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ఆందోళనకరమైన విషయం” అని పేర్కొన్నారు.

విద్యార్థుల గొంతును అణచివేయడం కాకుండా, వారి సమస్యలను ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు నిష్పాక్షికంగా విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.