ఇబ్రహింపట్నం, జూలై 22 ( చైతన్యగళం) : యాచారం మండలం సర్పంచ్ ఫోరం మండల కార్యవర్గాన్ని బుధవారం మేడిపల్లి గ్రామంలో నిర్వహించారు. యాచారం సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షునిగా మంతన్ గౌరెల్లి గ్రామ సర్పంచ్ అధ్యక్షునిగా కొర్ర అరవింద్ నాయక్ ను , సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా మండల సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులుగా 1.నీలం శ్రీవిద్య (కురుమిద్ద),2. అంబోజి రమేష్ (తులేకుర్ద్), ప్రధాన కార్యదర్శిగా డేరంగుల శంకర్,(మల్కీజ్ గూడ) గౌరవ ఆధ్యక్షులుగా.. ముచ్చర్ల సుగుణ సంపత్, (నకర్త మేడిపల్లి) , కార్యదర్శులుగా బోడ కృష్ణ (సింగారం), కిషన్ నాయక్ (నల్లవెల్లి) , కోశాధికారిగా రమేష్ నాయక్ (కేసీ తండా), సహాయ కార్యదర్శిగా తొట్ట రమేష్ (చింతపట్ల), కార్యవర్గ సభ్యులుగా.. అనిత శరణం (యాచారం), ఝాన్సీ రమేష్ (తాడిపత్రి) చైతన్య రాజు (నానక్ నగర్), వెన్నెల శేఖర్ (కొత్తపల్లి) ఈ ఎన్నిక కార్యక్రమంలో నందివపర్తి సర్పంచ్ విజయకుమార్, సర్పంచ్లు బెల్లీ అశోక్ ,నక్క అలివేలు వెంకటేష్, రాజు, మంగా జంగయ్య, కౌసల్య జగదీష్, తదితరులు పాల్గొన్నారు.