5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పెద్దపల్లి, జూలై 21 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల శివారులో నక్కల ఓర్రెపై రూ.50 లక్షల నిధులతో బ్రిడ్జి, మీర్జాంపేట–తారుపల్లి మధ్య రూ.1.55 కోట్ల నిధులతో బ్రిడ్జి, వ్యవసాయ మార్కెట్ భవనం & ప్రహరీ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులు, మహిళా భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, తారుపల్లిలో గ్రామ...