యువత గొంతును అణచలేరు

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ న్యూఢిల్లీ, జూలై 21 (చైతన్యగళం‌): దేశ యువత తమ హక్కుల కోసం ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై బలప్రయోగం జరగడం అత్యంత దురదృష్టకరమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరాన్ని అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, “విద్యార్థులు, యువత తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి...