జంతర్‌మంతర్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ–పెద్దపల్లి, జూలై 21 (చైతన్యగళం): జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరసనలో పాల్గొన్న పిల్లలు, మహిళలు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు గ్యాస్ బాంబులు ప్రయోగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా, బాధితులు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను...