శ్రీనగర్ లో లెవెల్ బ్రిడ్జి పరిశీలించిన ఎమ్మెల్యే ధన్‌పాల్
నూతన వంతెన అంచనాలు సిద్ధం చేయాలని సూచన నిజామాబాద్, జూలై 21 (చైతన్యగళం): ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. నగరంలోని వినాయక నగర్ నుంచి ఎల్లమ్మగుట్టకు వెళ్లే దారిలో బాలహనుమాన్ ఆలయం పక్కన గల లో లెవెల్ బ్రిడ్జిని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “వర్షాకాలంలో వంతెన వద్ద నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బ్రిడ్జి ఇరువైపులా...