ప్రశ్నిస్తే లాఠీచార్జీనా? విద్యార్థుల గొంతు నొక్కేయాలనుకుంటున్నారా?

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ అచ్చంపేటలో ఐఏఎస్ ఎఫ్ నిరసన సమావేశం. అచ్చంపేట, జూలై 21(చైతన్యగళం): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి, యువజన సంఘాలపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తూ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాగర్‌కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ప్రశ్నించే విద్యార్థులపై ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడం...