హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని జేఎన్‌టీయూహెచ్ విద్యార్థుల ఆందోళన

మహబూబాబాద్(చైతన్యగళం): మహబూబాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు, విద్యార్థులు హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తరగతులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. హాస్టళ్లలో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, మౌలిక వసతులను వెంటనే మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. హాస్టల్‌లో సుమారు 50 మంది విద్యార్థులకు ఒకే బాత్‌రూమ్ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రిన్సిపాల్, వార్డెన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కళాశాల ప్రిన్సిపాల్ బలరాంను విద్యార్థినులు ముట్టడించి సమస్యలపై...