అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకులపై పోలీసుల ప్రత్యేక దాడులు
మహబూబాబాద్, జూలై 20 (చైతన్యగళం): జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై మహబూబాబాద్ జిల్లా పోలీసులు సోమవారం ప్రత్యేక దాడులు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ రుణగ్రహీతల నుంచి షూరిటీల పేరుతో ఖాళీ చెక్కులు, భూముల అసలు పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ...