రాజన్న సిరిసిల్లలో బీజేపీ నూతన కమిటీ నియామకం

రాజన్న సిరిసిల్ల, జూలై 20 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామచంద్రరావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ మోర్చాల అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన జిల్లా మోర్చా అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మోర్చా అధ్యక్షులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ఆయా మోర్చాల ద్వారా ప్రతి కార్యకర్తను,...