మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి కృషి అవసరం – రోటరీ క్లబ్
మహబూబాబాద్, జూలై 20 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ అధ్యక్షుడు దూదికట్ల సత్యం అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహబూబాబాద్ మోడల్ స్కూల్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వందకు పైగా మొక్కలు నాటారు. అధ్యక్షుడు సత్యం మాట్లాడుతూ, “అడవుల నరికివేత, పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలో...