రామడుగు, జూలై 20 (చైతన్యగళం):
రామడుగు మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కోసం మూడు రోజుల ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమం సోమవారం పీఎం శ్రీ స్కూల్ కొత్తపల్లిలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్, మండల విద్యాధికారి రంగనాథ శర్మ పాల్గొని ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆయన మాట్లాడుతూ, “తెలుగు, గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులలో రెమిడీయేషన్ ప్రోగ్రామ్ ద్వారా తక్కువ స్థాయి విద్యార్థులను గుర్తించి వారి నైపుణ్యాలను మెరుగుపరచాలి” అని తెలిపారు.శిక్షణలో రిసోర్స్ పర్సన్స్ రవీందర్, శ్రీనివాస్, హరిప్రియ పాల్గొని ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేశారు.