పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత
కరీంనగర్ జూలై 19 (చైతన్యగళం): లైన్ నిర్వహణ పనుల కారణంగా 11 కేవీ ఐబీ ఫీడర్ పరిధిలో నేడు మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ ఎం. లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిపివేయబడే ప్రాంతాల్లో కోర్టు చౌరస్తా, పాత డీఐజీ భవనం పరిసరాలు, ఐబీ చౌరస్తా ప్రాంతం, సర్కస్ గ్రౌండ్ ఏరియా, పద్మనాయక కళ్యాణ మండపం పరిసర ప్రాంతాలు ఉన్నాయి. సంబంధిత ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని ఆమె కోరారు.