గ్రామ స్థాయిలో పోలీసింగ్ బలోపేతం అవసరం – జిల్లా ఎస్పీ డా. శబరీష్
మహబూబాబాద్, జూలై 20 (చైతన్యగళం): జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సోమవారం గార్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణను సమీక్షించి, పెండింగ్ కేసులను నాణ్యతతో, చట్టపరమైన విధానాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై వారి విధుల నిర్వహణ, సమస్యలు, పనితీరుపై ఆరా తీశారు. ముఖ్యంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్లతో (VPOలు) మాట్లాడుతూ గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. గ్రామాల్లో...