వెంకటేశ్వర కాలనీలో వైభవంగా పోచమ్మ బోనాలు – హాజరైన మేయర్, డిప్యూటీ మేయర్
కరీంనగర్ టౌన్, జులై 19 (చైతన్యగళం): కరీంనగర్ 12వ డివిజన్‌లోని వెంకటేశ్వర కాలనీలో పోచమ్మ బోనాల 12 వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వారి ఆధ్వర్యంలోమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్ సునీల్ రావు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు గాజె నాగులు, కమిటీ...