యువతతోనే పార్టీ బలోపేతం.. అంకితభావంతో పనిచేయాలి – తల్లోజు ఆచారి

ఆమనగల్లు, జూలై 20 (చైతన్యగళం): యువత పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని, అంకితభావంతో పనిచేస్తూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. నూతనంగా బీజేవైఎం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నరేష్ చారి సోమవారం తల్లోజు ఆచారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం తల్లోజు ఆచారి మాట్లాడుతూ యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,...