CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 10:32 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువతతోనే పార్టీ బలోపేతం.. అంకితభావంతో పనిచేయాలి – తల్లోజు ఆచారి

ఆమనగల్లు, జూలై 20 (చైతన్యగళం):
యువత పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని, అంకితభావంతో పనిచేస్తూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. నూతనంగా బీజేవైఎం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నరేష్ చారి సోమవారం తల్లోజు ఆచారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం తల్లోజు ఆచారి మాట్లాడుతూ యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. నరేష్ చారి మాట్లాడుతూ తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ ఆశయాల సాధనకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ కౌన్సిలర్ సునీత ప్రశాంత్ నాయక్, కల్వకుర్తి కౌన్సిలర్ రాంభూపాల్ రెడ్డి, బోడ నరసింహ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు కృష్ణ యాదవ్, రాఘవేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, సర్పంచ్ మహేష్ సర్కార్, ఆమనగల్ మండల అధ్యక్షుడు కేకే శ్రీనివాస్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీజేవైఎం కో-కన్వీనర్ నేనావత్ రవి రాథోడ్, బీజేవైఎం అసెంబ్లీ కో-కన్వీనర్ రాజశేఖర్, రవి గౌడ్, పద్య నాయక్, సంజీవ నాయక్, సుమన్ నాయక్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.