CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 4:47 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హౌస్ అరెస్ట్

నిజామాబాద్, జూలై 20 (చైతన్యగళం‌):
అంకాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఇంటి వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోంది” అని విమర్శించారు.

అతను మరింతగా మాట్లాడుతూ, “ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశలో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య” అని అన్నారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా వారిని అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని ధన్‌పాల్ పేర్కొన్నారు. “ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు” అని ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.