బోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అవసరం – ఏసీజీఈ సెంటర్ ఇన్‌చార్జ్ మందుల శ్రీరాములు

మహబూబాబాద్, జూలై 20(చైతన్యగళం): స్థానిక మోడల్ స్కూల్, అనంతారంలో సోమవారం నిర్వహించిన “ఇన్-సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ – ట్రాన్స్‌ఫార్మేటివ్ క్లాస్‌రూమ్ ఆక్టివిటీస్” కార్యక్రమంలో ఏసీజీఈ సెంటర్ ఇన్‌చార్జ్ మందుల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులు సాంప్రదాయ బోధనతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి విద్యార్థుల అభ్యాసాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలి” అని సూచించారు. విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సహకార భావన వంటి 21వ...