జిల్లా ఉపాధి కార్యాలయంలో జూలై 22న జాబ్ మేళ

మహబూబాబాద్, జూలై 20(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 22న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత తెలిపారు. మహబూబాబాద్, కేసముద్రం, తానంచెర్ల, మరిపెడ, దంతాలపల్లి, కురవి, నెల్లికుదురు, బయ్యారం, చిన్నగూడూరు ప్రాంతాల్లో పనిచేయడానికి అర్హత కలిగిన పురుష అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గరిష్ఠంగా 30 సంవత్సరాల వయస్సు కలిగి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల...