సరస్వతి శిశు మందిర్‌లో కంప్యూటర్లు, సంగీత వాయిద్యాల ప్రారంభోత్సవం
సిరిసిల్ల, జూలై 20 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గాంధీనగర్లో సోమవారం ఉదయం దాతలు అందించిన కంప్యూటర్లు, తబలా, మృదంగం, హార్మోనియం వంటి సంగీత వాయిద్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఆధునిక సాంకేతిక విద్యతో పాటు భారతీయ సంగీతాన్ని అభ్యసించేందుకు వీలుగా ఈ పరికరాలను పాఠశాల యాజమాన్యం అధికారికంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరు బుచ్చయ్య మాట్లాడుతూ విద్యార్థుల...