విరాట పర్వం పఠించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు

నందికొట్కూరు, జూలై 19 (చైతన్యగళం): స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మహాభారతంలోని విరాట పర్వంను పఠించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విరాట పర్వానికి మహాభారతంలో విశిష్ట స్థానం ఉంది. దీనిని పఠించడం ద్వారా సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని విశ్వాసం ఉంది. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు పుష్కల వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ‘సమస్త లోకాః సుఖినో భవంతు’ అనే సంకల్పంతో...