కోమాండ్ల మల్లారెడ్డి చిత్రపటానికి ఈగ మల్లేశం నివాళి

వర్ధన్నపేట, జూలై 20 (చైతన్యగళం): వర్ధన్నపేట మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మన్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ఆదివారం పరామర్శించారు. ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం దివంగత కోమాండ్ల మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. “ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని ఈగ మల్లేశం పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో...